Home

»

Latest News

కాళీమాత ఫైట్ సీక్వెన్స్: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్.!

Sep 30, 2026 2:47PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. 'సలార్', 'కె.జి.యఫ్' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఈసారి ఎన్టీఆర్ కోసం డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా మూడు మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నాయట.

అందులో మొదటిది.. జైలు ఫైట్ సీన్. గ్యాంగ్ స్టర్లతో ఎన్టీఆర్ తలబడే సీన్ ఓ రేంజ్ లో ఉంటుందట. రెండోది.. కాళీమాత ఫైట్ సీక్వెన్స్. ఆ కాళికా దేవి ఆవహించినట్లు ఎన్టీఆర్ చూపించే రౌద్రం, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేయబోతోంది. ఇక మూడోది.. బ్లడ్ ఫైట్ సీన్. పిచ్చెక్కిపోయే వైలెంట్ ప్రెజెన్షన్ తో ప్రశాంత్ నీల్ ఈ సీన్‌ని డిజైన్ చేశారట.

మాస్ యాక్షన్‌కు అసలైన డెఫినిషన్ ఇస్తూ 'డ్రాగన్' మూవీ టోటల్ ఇండియన్ సినిమా మార్కెట్‌ని ఒక ఊపు ఊపడానికి వస్తోంది. ఈ సినిమా 2027, జూన్ 11న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

ఇది కూడా చదవండి: డ్రాగన్ రిలీజ్ డేట్.. వాయిదాపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!

 

 

 

[Dragon Action Scenes, Dragon Kali Matha Fight, Jr NTR Dragon Movie, Dragon Jail Fight, Dragon Release Date, NTR Neel Movie, Jr NTR, Prashanth Neel, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com