
ఇండస్ట్రీలో ఎవడి టాలెంట్ అయినా స్టెప్ బై స్టెప్ నిదానంగా వెలుగులోకి వస్తుంది. అది సినిమా అనాదిగా పెట్టుకున్న రూల్. వెలుగులోకి వచ్చాక వాడ్ని ఆపడం వాడ్ని పుట్టించిన బ్రహ్మ దేవుడి వల్ల కూడా కాదు. ఇప్పుడు ఆ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రియదర్శి. ది ప్యారడైజ్ లో.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శైలిని, హావభావాలని , డైలాగ్ డెలివరీని ప్రియదర్శి అత్యంత అద్భుతంగా అనుకరించి వెండితెరపై ఆవిష్కరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు 'ది పారడైజ్' ని వీక్షించి ప్రియదర్శి నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేసీఆర్ గారి నడక, మాట తీరు, రాజసంతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రియదర్శి తెరపై పునఃసృష్టించిన విధానం అద్భుతమని, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని చిన్ననాటి నుండి నిశితంగా గమనించిన వారికి ప్రియదర్శి రోల్ లో కేసీఆర్‌ను చూడటం ఒక భావోద్వేగ అనుభూతిని అందించిం ది. ప్రియదర్శి చూపిన కట్టుబడి, నటనలో కనిపించిన స్పష్టత తెలంగాణ సాంస్కృతిక ముద్రను ఎంతో ఘనంగా చాటిచెప్పాయని హరీష్ రావు చెప్పాడు. ప్రియదర్శి కి శాలువా కప్పి జ్ఞాపికని కూడా అందించాడు
ఇది కూడా చదవండి: 2 కోట్ల ఫుడ్ బిల్లు నువ్వే కట్టు: డైరెక్టర్‌పై ప్రొడ్యూసర్ ఫైర్: అది ఈ సినిమానేనా!

కేవలం నటనతోనే కాకుండా తెలంగాణ యాసను, కేసీఆర్ ప్రత్యేక శైలి మాటకారితనాన్ని నూటికి 100 శాతం ఒడిసిపట్టుకోవడంలో ప్రియదర్శి విజయవంతమయ్యారని సినిమా చూసిన ప్రేక్షకులు సైతం కొనియాడుతున్నారు. థియేటర్లలో ప్రియదర్శి కేసీఆర్ శైలిలో డైలాగ్స్ చెబుతుంటే ఈలలు, కేకలతో హాల్స్ మార్మోగిపోతున్నాయి. దాదాపు 100 శాతానికి పైగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రియదర్శి తన పాత్రలో జీవించడం విశేషం.హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రియదర్శిని అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి పొగడ్తలు ఎక్కువయ్యి ప్రియదర్శి దిష్టి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
[Harish Rao Praises Priyadarshi, The Paradise Priyadarshi Kcr Role, The Paradise Movie, Priyadarshi KCR Role, , The Paradise Review,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]






