Home

»

Latest News

Ram charan: కలిసారా, కలవలేదా.. రిప్లై కోరుతున్న ఫ్యాన్స్ 

Mar 27, 2026

 

-చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే
-ఘనంగా జరుగుతున్న చరణ్ బర్త్ డే వేడుకలు 
-పెద్ది గ్లింప్స్ రాక

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr).. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన డైనమేట్స్. కట్ అవుట్ కనపడితే చాలు కాసుల వర్షం. ఫ్యూచర్ లో ఆ ఇద్దరు ఎలాంటి సినిమాలతో వస్తారని ఫ్యాన్స్, మూవీ లవర్స్ చేత డైలీ ఆలోచింపచేసే సత్తా కూడా ఉన్న వాళ్ళు. చరణ్ ప్రస్తుతం పెద్దితో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఈ రోజు చరణ్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరి అభిమానుల్లో సరికొత్త చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి(SS Rajamouli)ని అనిల్ రావిపూడి(Anilravipudi)ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ మాట్లాడుతు 'చరణ్ ది మార్చి 27 బర్త్ డే. నా వైఫ్ ప్రణతి బర్త్ డే మార్చి 26 . ఆ రోజు మిడ్ నైట్ 12 గంటలకి ప్రణతి నాకోసం చూస్తుంది. నేను లేకపోయేసరికి ఫోన్ చేస్తే 12 దాటింది కదా చరణ్ తో కారులో  ఉన్నానని చెప్పేవాడిని. ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఈ విషయం రాజమౌళికి తప్పు ఎవరకి తెలియదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దీంతో మరి నిన్న మళ్ళీ కలిసారా అని ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.

Also read: Peddi: గ్లింప్స్ లోని ఆ డైలాగ్ లో తప్పు ఉంది! లేక ఏదైనా లాజిక్ ఉందా!

ఇక ఈ ఇద్దరు కలిసి మొదటిసారి చేస్తేనే ఆస్కార్ తెలుగు సినిమా వశమయ్యింది. ఈ సారి కలిసి చేస్తే ఆస్కార్ టీం తెలుగునాట తిష్ట వెయ్యడం ఖాయమని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక నెరవేరాలని శ్రీరామనవమి శుభదినాన కోరుకుందాం. చరణ్ కి రెండు రోజుల క్రితం కంటికి గాయమయ్యి కోలుకుంటున్న విషయం తెలిసిందే. బర్త్ డే సందర్భంగా చరణ్ నుంచి  ఈ రోజు పెద్ది గ్లింప్స్ వచ్చింది.     

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com