సూర్య 24 విషయంలో నితిన్ హర్టయ్యాడా..?
on Apr 19, 2016
సూర్య 24 సినిమా ఏ అవాంతరాలూ లేకుండా సాగిపోతోందని అందరూ అనుకుంటున్న టైంలో సడెన్ గా ట్విస్ట్ వచ్చింది. తమిళ్ లో జ్ఞానవేల్ రాజా నిర్మించిన 24 ను తెలుగులో హీరో నితిన్ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఏమైందో ఏమో, సడెన్ గా ఆంధ్ర పాంతంలో, జ్ఞానవేల్ సంస్థ స్టూడియో గ్రీన్ డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మే 6 న నితిన్ తన అ..ఆ ను లాక్ చేసి పెట్టుకున్నా, సూర్య ప్రెస్ మీట్ పెట్టి, తన సినిమా రిలీజ్ ను కూడా మే 6 కే ప్లాన్ చేయడం, ఆ డేట్ గురించి తనను కనీసం సంప్రదించకపోవడం నితిన్ కు కోపం తెప్పించిందట. అందుకే తెలుగు వెర్షన్ రైట్స్ కొనుక్కున్నప్పటికీ, సినిమాను రిలీజ్ చేయడం నుంచి పక్కకు తప్పుకున్నాడట. దీంతో స్టూడియో గ్రీన్ సంస్థ, సినిమాను డైరెక్ట్ గా విడుదల చేసుకుంటోందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై నితిన్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.