Home

»

Latest News

Nithya menen: నిత్యామీనన్ కొత్త సినిమా..హీరో, హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచినట్టే

Jun 9, 2026 11:40AM

 


దక్షిణాది సినీ ప్రేమికులకి, ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నిత్యామీనన్(Nithya menen). ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ కి ప్రేక్షకులు జేజేలు పలికేలా చెయ్యడంలో ఆరి తేరిన నటి. గ్లామర్ క్యారెక్టర్ల జోలికి వెళ్లకుండా నటనకి ప్రాధాన్యమున్న వాటిని  ఎంచుకుంటూ, వెండితెరపై తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులని  చేస్తోంది. 

గత ఏడాది అక్టోబర్ లో ధనుష్ తో చేసిన 'ఇడ్లీ కడై' (తెలుగులో 'ఇడ్లీ కొట్టు') చిత్రం తర్వాత నిత్యా మీనన్, తాజాగా ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కథ నచ్చితేనే సంతకం చేసే నిత్యాకు, ఈ కొత్త ప్రాజెక్ట్ లైన్ తెగ నచ్చేసిందని సమాచారం. దర్శకురాలిగా మారేందుకు ప్లాన్ చేసుకుంటున్న తరుణంలోనే, నిత్యా మీనన్ మరో క్రేజీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. యామిరుక్క బయమేన్', 'కవలై వేండాం' వంటి విభిన్నమైన చిత్రాలతో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు డీకే (DK) చెప్పిన ఒక వైవిధ్యమైన లేడీ ఓరియెంటెడ్  కథకి  నిత్యా మీనన్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.


Also read: లెనిన్ ఆంధ్ర బిజినెస్ క్లోజ్.. షాకింగ్ రేట్!

సరికొత్త జోనర్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో నిత్యా మీనన్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్ మరియు క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతోందని టాక్. అయితే ఈ చిత్రానికి పూర్తి పారితోషకం తీసుకోకుండా అడ్వాన్స్ మాత్రమే తీసుకొని వచ్చే లాభాల్లో వాటాని పారితోషకంగా తీసుకోనుందనేది టాక్ . ఇదే నిజమైతే పలువురు హీరో, హీరోయిన్స్ కి నిత్య మీనన్ ఆదర్శంగా నిలిచినట్టే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com