"యాక్టర్‌గా రిస్క్ తీసుకోవాలనే 'మాస్ట్రో' చేశాను"
on Sep 15, 2021
కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటామనీ, ఒక యాక్టర్‌గా రిస్క్ తీసుకోవాలనే మాస్ట్రో మూవీ చేశాననీ అన్నాడు హీరో నితిన్. హిందీ బ్లాక్‌బ్లస్టర్ 'అంధా ధున్' తెలుగు రీమేక్ 'మాస్ట్రో'లో ఆయన మెయిన్ లీడ్‌గా చేశాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి, సోదరి నికితారెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తమన్నా, నభా నటేశ్, జిషుసేన్ గుప్తా, నరేశ్, మంగ్లీ కీలక్ పాత్రలు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన 'మాస్ట్రో' ప్రి రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడాడు.
"హిందీలో కల్ట్ ఫిలిం అయిన 'అంధా ధున్'ను రీమేక్ చేయాలనుకున్నప్పుడు మొదట ఇది అవసరమా, కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు కదా అనుకున్నాను. కానీ ఒక యాక్టర్‌గా రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమాలు చెయ్యాలి అని ఈ సినిమా ఒప్పుకున్నాను. దీనికి డైరెక్టర్ ఎవరని ఆలోచించినప్పుడు మేర్లపాక గాంధీ స్ఫురించాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. ఒరిజినల్లోని సోల్ మిస్సవకుండా, మనకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసి, కొంచెం హ్యూమర్ జోడించి సినిమా తీశాడు. సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సినిమా వస్తోంది. హిందీ సినిమా ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అంత బాగుంటుందని అనుకుంటున్నాను. అని ఆయన చెప్పాడు.
'భీష్మ' తర్వాత మరోసారి మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడనీ, పాటలకు ఎంత చక్కని మ్యూజిక్ ఇచ్చాడో అంతకు మించి రీరికార్డింగ్ ఇచ్చాడనీ తెలిపాడు. "ఆ రీరికార్డింగ్‌తో సినిమాని థియేటర్లలో చూస్తే ఆ ఫీల్ వేరే వుంటుందని నేను, గాంధీ ఫీల్ అయ్యాం." అని చెప్పాడు నితిన్.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఓటీటీలో వస్తోందని ఆయన అన్నాడు. "సినిమాలో విజువల్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ప్రధానంగా నాలుగు క్యారెక్టర్స్ ఉంటాయి. హిందీలోనూ ఆ నలుగురూ సినిమాని వేరే లెవల్‌కి తీసుకు వెళ్లారు. తెలుగులోనూ అలాగే ఉంటుంది. మేం సినిమాలో కొన్ని రిస్కీ స్టెప్స్ తీసుకున్నాం. విలన్ రోల్‌కు జిషుసేన్ గుప్తాను తీసుకున్నాం. టబు రోల్‌ను ఎవరితో చేయించాలనుకున్నప్పుడు తమన్నా అయితే బాగుంటుందనుకున్నాం. తను మెయిన్ స్ట్రీం హీరోయిన్గా చాలా బిజీగా ఉంది. చేస్తుందో, లేదో అనుకున్నాం. కానీ తను కూడా డేరింగ్ స్టెప్ తీసుకొని ఆ క్యారెక్టర్ చేసింది. చాలా గొప్పగా చేసింది. నభాకూ, నాకూ మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయ్. ఒరిజినల్ కంటే తెలుగులో లవ్ సీన్లు ఎక్కువ పెట్టాం. గ్రేట్ సింగర్ అయిన మంగ్లీతో ఒక క్యారెక్టర్ చేయించాం. ఆ క్యారెక్టర్‌కు మంగ్లీ అయితే చాలా బాగుంటుందని నాన్న చెప్పడంతో ఆమెతో చేయించాం. మా నాన్న తర్వాత ఇండస్ట్రీలో నాకు ఫాదర్ ఫిగర్ నరేశ్ గారు. పాజిటివ్ ఎనర్జీనిచ్చే ఆయనలాంటి మనుషులు చాలా రేర్‌గా ఉంటారు. నాకు తండ్రి క్యారెక్టర్ ఎవరంటే ఆయనే గుర్తుకొస్తారు. సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా." అని చెప్పుకొచ్చాడు నితిన్.
Also Read