
ప్రముఖ అందాల భామ నికిలా విమల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట ఫుల్ జోష్ మోడ్ లో ట్రావెల్ చేస్తున్నాయి. దాంతో నిఖిలా విమల్ రంగంలోకి దిగి పెళ్ళికి సంబంధించిన విశేషాలని చాలా క్లియర్ కట్ గా చెప్పేసింది.
నికిలా విమల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరు. ఎవర్ని ప్రేమించడం లేదు కూడా.పెళ్లి అనేది నా జీవితంలో ఇప్పుడే అంత అర్జంట్ కాదు. అసలు పెళ్లి గురించి నేనింకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ ఆలోచనే ప్రస్తుతానికి లేదు. ప్రేమ, పెళ్లి అనేవి జీవితంలో చాలా పెద్ద విషయాలేమీ కావు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే అప్పుడు చూసుకోవచ్చు . ప్రస్తుతం నా దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే ఉంది. మంచి క్యారెక్టర్స్ చేస్తూ నటిగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడమే నా ఏకైక లక్ష్యం. రూమర్స్ రావడం సహజమే అని చెప్పుకొచ్చింది.
Also read: Nag ashwin: కల్కి 2 షూటింగ్ అప్‌డేట్.. నాగ్ అశ్విన్ సంచలన ప్రకటన
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ చిత్ర సీమలో కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ నటిగా తన రేంజ్ మరింత పెంచుకోవాలని చూస్తుంది. తమిళంలో వెట్రివేల్, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్ తొళిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నికిలా, ఇటీవల మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'వాళై' సినిమాతో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి వంటి చిత్రాల్లో చేసింది.






