Home

»

Latest News

Mahendragiri Varahi: 'మహేంద్రగిరి వారాహి' టీజర్ డేట్ ఫిక్స్.. టాలీవుడ్ 'కాంతార' అవుతుందా?

Jun 6, 2026 3:52PM

సుమంత్ (Sumanth) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi). సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మధు కాలిపు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి అందించారు.

జూన్ 8న 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల కాబోతుంది. డివోషనల్ టచ్ ఉన్న సినిమా కావడంతో ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ టీజర్ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 

మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది. రిచ్ విజువల్స్, ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని మేకర్స్ చెబుతున్నారు.

సుమంత్ కెరీర్ లో 'మహేంద్రగిరి వారాహి' సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com