
సోషల్ మీడియా ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, గ్లామర్‌తో మెరిసిపోతున్న ఒక నటి జీవితం వెనుక ఇంతటి పెను విషాదం ఉందంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ప్రముఖ మోడల్, బుల్లితెర నటి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ (30) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సినీ, డిజిటల్ వర్గాల్లో దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది.
జీవితంలో ఎంతో భవిష్యత్తు ఉండి, కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన సమయంలో ఆమె ఇలా అర్ధాంతరంగా నూరేళ్లు నిండకుండానే తనువు చాలించడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. నిధి తివారీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బాండా జిల్లా రాయపూర్ పరిధిలోని కేక్రా. ఆ ఊరికే చెందినతన పూర్వీకుల ఇంటిలో నిధి ఊరి వేసుకొని చనిపోయింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కోణంలో విచారణ జరుపుతున్నారు.
నిధి తివారీకి చిన్నతనం నుంచే గ్లామర్ రంగంపై తీవ్ర ఆసక్తి ఉండేది. తన కలలను నిజం చేసుకునేందుకు నటనపై దృష్టి పెట్టి, ముంబై సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో కష్టపడిన నిధి, తక్కువ సమయంలోనే బుల్లితెరపై కొన్ని ప్రాజెక్టుల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 'సావధాన్ ఇండియా' వంటి ప్రముఖ క్రైమ్ సిరీస్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ధారావాహిక ద్వారా ఆమె నటనా ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా క్రేజ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 6,36,000 (636k) మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి రీల్, షేర్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యేవి. ప్రతిరోజూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించే నిధి ఖాతా నుంచి నిత్యం క్రమం తప్పకుండా వీడియోలు, పోస్టులు ప్రత్యక్షమయ్యేవి.
ఇది కూడా చదవండి: వైరల్ గా మారిన న్యూస్: హనుమాన్ అంశ్ హీరో నిజజీవిత చరిత్ర ఇదే!
ఏది ఏమైనా ఆమె మరణం అభిమానులకి షాకింగ్ న్యూస్. అందుకే సోషల్ మీడియాలో సరదాగా రీల్స్ చేసే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు, ఉహించుకోకూడదు. వాళ్ళు తమ మనసులో ఉండే బాధలన్నిటిని దాచుకొని జస్ట్ ఫన్నీ గానే చేస్తారు అని .సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడం పలు అనుమానాలకి దారితీస్తోంది.
[Nidhi Tiwari Suicide Case, Nidhi Tiwari, Nidhi Tiwari death, Instagram influencer suicide,elugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





