Home

»

Latest News

Newtons 3rd law movie review in Telugu: 'న్యూటన్స్ థర్డ్ లా' మూవీ రివ్యూ

Jul 31, 2026 12:34PM

 

-మూవీ పేరు: న్యూటన్స్ థర్డ్ లా
-న‌టీన‌టులు: సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, త్రినాథ్ వర్మ, రవివర్మ, షెల్లీ కుమార్, నేహా పఠాన్, అభినయన, గౌతమ్ పండిట్  తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: వేద వ్యాస్ గొట్టిపాటి  
-ఎడిటింగ్: అనిల్ పలాస 
-మ్యూజిక్: సింజిత్ యర్రమిల్లి 
-నిర్మాత‌:హరీష్ కోహిర్కర్ 
-బ్యానర్ :ఈటీవీ విన్ 
-రచన,దర్శకత్వం: రాజేష్ కర్ణ 
-రిలీజ్ డేట్ : జులై 31 ,2026 


వైవిధ్యమైన చిత్రాలని అందించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ ఈటీవీ విన్. ఈ రోజు సుమంత్, జగపతి బాబు వంటి స్టార్ స్టేటస్ ఉన్న నటులతో 'న్యూటన్స్ థర్డ్ లా' అనే మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టింది. టైటిల్ తో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడంతో నిన్న ప్రీమియర్స్  ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
డేవిడ్(అవసరాల శ్రీనివాస్) అనే వ్యక్తి ప్రపంచానికి దూరంగా ఒక దీవిలో పెద్ద భవంతిని ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉంటాడు. జ్యోతి(నేహా పఠాన్) ఒక హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంటుంది. వేరే ఊరులో ఉన్న తన భర్తకి ఉద్యోగం రావడంతో ఆరేళ్ళ తన కూతురుతో కలిసి భర్త దగ్గర ఉండటానికి సిద్దమవుతుంది. జ్యోతి పని చేసే హాస్పిటల్ లోనే నర్స్ డిపార్ట్మెంట్ కి పార్వతి( షెల్లీ కుమార్) హెడ్. పార్వతి భర్త గంగాధర్(రవివర్మ) ఖాళీగా ఇంట్లోనే ఉంటూ మత్తుకి బానిస అవుతాడు. కొడుకు పేరు వినయ్( త్రినాథ్ వర్మ) లైఫ్ లో త్వరగా గొప్పవాడు కావాలని అనుకునే మెంటాలిటీ. ఈ క్రమంలో తన ఫ్రెండ్ కార్తీక్( గౌతమ్ పండిట్) తో కలిసి  రాంగ్ రూట్ లో డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. స్టీఫెన్ మెర్క్యురీ(జగపతి బాబు) ఒక అసాంఘిక శక్తి. చట్ట విరుద్ధంగా స్మగ్లింగ్ చేస్తుండటం, అడ్డొచ్చిన వాళ్ళని చంపుతుండటం స్టీఫెన్ నైజం. ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్స్ యొక్క లైఫ్ లోకి పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్( సుమంత్) ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందనేదే న్యూటన్స్ థర్డ్ లా.

ఎనాలసిస్ 
 పేపర్ పై  కథగా రాసుకుంటే క్యూరియాసిటీ ఉన్న కథనే. పైగా కర్మ సిద్ధాంతం అనేది మూవీ యొక్క ప్రధాన పాయింట్. అంటే మన వల్ల ఎన్నో కలలు కంటూ ఉన్న ఒక మనిషి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే, అది మన చావు వరకు తీసుకెళ్తుందని చెప్పారు. కానీ కథనం విషయంలో మాత్రం నచ్చేలా  చెప్పలేకపోయారు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ బాగోలేదు. వినయ్ క్యారక్టర్ దొంగతంగా బైక్ ఇంజిన్ ని దొంగిలించి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అతను అలా చేస్తున్నప్పుడు వచ్చిన సాంగ్ ని వినయ్ దేశం కోసం పోరాడుతూ  ఉండే యువకుడిగా  సాంగ్ ప్లే చేయడం పెద్ద విచిత్రం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే   సార్టింగ్  లో వచ్చిన డేవిడ్ సీన్, వినయ్ సీన్, జ్యోతి సీన్ తో మూవీపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ అక్కడ్నుంచి సినిమా క్లైమాక్స్ వరకు వచ్చిన ప్రతి సీన్ మెప్పించే స్థాయిలో సాగలేదు. వాసుదేవ్ (సుమంత్) చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా నార్మల్. చుట్టపు చూపుగా వచ్చి పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. వినయ్, కార్తీక్ మధ్య వచ్చిన సీన్స్ లో కొన్ని బాగున్నా, డైలాగ్స్ సరిగా రాసుకోకపోవడంతో అర్ధం పర్థం లేని సీన్స్ గా మిగిలిపోయాయి. పార్వతి ,గంగాధర్ సీన్స్ పర్లేదు.    ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్స్ లో అయినా వేగం పెరుగుతుంది అనుకుంటే వినయ్, కార్తీక్ మధ్య డైమండ్స్ మధ్య గొడవ పెట్టి, అదే పాయింట్ పై అర్ధం పర్థం లేని బోలెడు సీన్స్ పెట్టి విసుగు తెప్పించారు. సెకండ్ హాఫ్ లో అయినా  స్టీఫెన్ మెర్క్యురీ(జగపతి బాబు) క్యారక్టర్ ని బాగా యాక్టీవ్ చెయ్యాల్సింది. ఆ దిశగా ఆలోచించకోపోవడంతో కథనం ఒకే పాయింట్ పై తిరుగుతుండటం విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ పర్లేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

వాసుదేవ్ గా  సుమంత్ నటనలో మెరుపులు లేవు.  మెరుపులు ప్రదర్శించే నటుడైనా     అత్యద్భుతమైన నటనని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది.జగపతి బాబుది అదే పరిస్థితి. కాకపోతే ఉన్నంతలో తన క్యారక్టర్ కి న్యాయం చేసాడు. కథకి హీరోగా భావించే  వినయ్ క్యారక్టర్ లో త్రినాధ్ వర్మ పెద్దగా సూటవ్వలేదు. కొన్ని సీన్స్ లో మాత్రం బాగా చేసాడు. అవసరాల శ్రీనివాస్, షెల్లీ కుమార్, నేహా పఠాన్ , రవివర్మ మాత్రం తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వడంతో పాటు కథనం బోర్ కొట్టకుండా సాగడానికి హెల్ప్ అయ్యారు. దర్శకుడు, రచయిత రాజేష్ కర్ణ విషయానికి వస్తే ఆ రెండు విభాగాల్లోను ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ అయితే అసలు బాగోలేదు. ఫొటోగ్రఫీ పర్లేదు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మెరుపులు నహి.  నిర్మాణ విలువలు పెద్దగా ఉండవు.

బలాలు 
1 . కథ 
2 .మూవీ స్టార్టింగ్ 10 నిమిషాలు, క్లైమాక్స్ 

బలహీనతలు 
 1 . కథనం 
2 . డైరెక్షన్ 

 
 
చివరిగా చెప్పుకోవాలంటే 'న్యూటన్స్ థర్డ్ లా' ని  చూస్తున్నంత సేపు  ప్రేక్షకులకి నచ్చడం కోసం తెరకెక్కించలేదేమో అనిపిస్తుంటుంది.
   

Rating 2 /5                                                                                             అరుణాచలం 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com