Home

»

Latest News

ఓటీటీలోకి 'దీవానా'.. యువతకు నచ్చే రొమాంటిక్ డ్రామా.!

Jul 31, 2026 12:54PM


 

యువతకు నచ్చే యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'దీవానా' థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్‌లో యూత్‌ను, ఎమోషనల్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ రొమాంటిక్ డ్రామా ఈరోజు (జూలై 31) నుండి ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 143 నిమిషాల రన్‌టైమ్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా, స్మేహా మణిమేగలై హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అంతేకాకుండా నరేష్, ఝాన్సీ, బలగం వేణు, జీవన్ కుమార్ తదితరులు కీలక పాత్రలలో కనిపించి తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు.

'దీవానా' కథ విషయానికొస్తే.. డిగ్రీ పూర్తి చేసి బాధ్యత లేకుండా తిరిగే మున్నా (హర్షిత్ రెడ్డి), ప్రభుత్వ ఉద్యోగి అమూల్య (స్నేహ మణిమేగలై) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రేమ కోసం మారాలనుకునే కుర్రాడి ప్రయాణమే ఈ చిత్రం.

ప్రేమ, స్నేహం, కుటుంబ బాధ్యతలు, జీవితంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారే యువకుడి ప్రయాణంగా తెరకెక్కింది. సెన్సార్ బోర్డు నుండి 'A' సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం, యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకుంటుంది. 

 

 

Deewana Movie, OTT Telugu, Harshith Reddy, Smeha Manimegalai

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com