Home

»

Latest News

Balakrishna: ముంబైకి బాలయ్య.. ఈసారి మామూలుగా ఉండదు!

May 28, 2026 9:29AM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించబోయే 111వ సినిమా (NBK 111) ముంబై నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే సుదీర్ఘమైన షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ ఒక గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేయనున్నట్లు సమాచారం. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 'భగవంత్ కేసరి' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది.

అలాగే, బ్లాక్ బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇద్దరి శైలికి తగినట్లుగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com