Home

»

Latest News

మహాశక్తి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే: దటీజ్ నయనతార!

Nov 7, 2026 10:49AM

 

లేడీ సూపర్ స్టార్ హోదాలో బిగ్ హీరోల రేంజ్ లో నిన్న రిలీజైన మాస్ అండ్ ఫాంటసీ మూవీ 'మహాశక్తి' కి నయనతార కట్ అవుట్స్ చాలా ఏరియాస్ లో దర్శనమిచ్చాయి. టాక్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తుండటంతో ఫెస్టివల్ మూడ్, వీకెండ్ ని ఎలా ఉపయోగించుకుంటుందనే ఆసక్తి ట్రేడ్ సర్కిల్స్ లో ఉంది. 


 తొలి రోజు 2.07 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. అందులో తమిళ వర్షన్ సుమారు1.75 కోట్ల నెట్ కాగా  తెలుగు వర్షన్ 16.95 లక్షల వరకు గ్రాస్ సాధించట్టుగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 777 థియేటర్లలో 2,159 షోలలో ప్రదర్శితమవ్వగా 1,36,397 టికెట్లు అమ్ముడయ్యాయి. సగటున 20.7% ఆక్యుపెన్సీ నమోదైంది. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మహాశక్తికి విశేష స్పందన లభించింది. ముందస్తు బుకింగ్స్ అడ్వాన్స్ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ₹11.05 లక్షల వసూళ్లతో 27% ఆక్యుపెన్సీ నమోదు కాగా, తెలంగాణలో 5.74 లక్షలతో 17% ఆక్యుపెన్సీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ కలిపి మొత్తం తెలుగు అడ్వాన్స్ కలెక్షన్స్ లో దాదాపు 98% వాటాను సాధించడం విశేషం.

తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 కాగా అగ్ర దర్శకుడు సుందర్ సి తెరకెక్కించాడు. నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా, ఉర్వశి మరియు దునియా విజయ్ కాంబినేషన్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చదవండి: నటి దాడి కేసులో కీలక మలుపు: అతను.. ఆ... వీడియోస్ తీసాడా!
 

కుటుంబ ప్రేక్షకులు ఈ ఫాంటసీ డివైన్ కామెడీని చూడటానికి థియేటర్లకు తరలివస్తుండటంతో వీకెండ్ లో ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరి వాళ్ళ నమ్మకం ప్రకారమే రాబోయే రోజుల్లో నయనతార బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు :మహాశక్తి రివ్యూ 
మీకు నచ్చవచ్చు :సీన్ మూవీ రివ్యూ 

 

[Nayanthara Mahasakthi First Day Collections, Nayanthara Mahasakthi first day collections, Mahasakthi box office collection day 1, Mookuthi Amman 2 Day 1 collection, Mahasakthi Telugu occupancy report, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com