
నటులకి సమాజంలో ఉండే గుర్తింపు తెలిసిందే. బయట ఎక్కడైనా అనుకోకుండా కనపడితే చాలు షేక్ హాండ్స్ ఇవ్వడం సెల్ఫీలు దిగడం లాంటివి అభిమానులు, ప్రేక్షకులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ నటులే తీవ్ర వివాదంలో చిక్కుకుంటే అవాక్కవయ్యి పూర్తి విషయాలని పిన్ టూ పిన్ గమనిస్తుంటారు.
కేరళలోని కొచ్చి నగరంలో వెలుగుచూసిన నటుల సంచలన కేసు సినిమా కథను తలపించేలా అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ప్రముఖ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జాన్సన్ కే. వర్గీస్ పై నటి అథుల్య చంద్ర మరియు ఆమె సహచరులు చేసిన దాడి, ఆపై వెలుగులోకి వచ్చిన దారుణమైన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఉదంతంలో పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఈ నెల 2వ తేదీ సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో కొచ్చిలోని ఎస్సెస్ స్ప్రింగ్‌డేల్ అపార్ట్‌మెంట్స్‌కు రమ్మంటూ డాక్టర్ జాన్సన్‌కు అత్యవసర వైద్య సహాయం కావాలనే నెపంతో ఫోన్ కాల్ వచ్చింది. నటి అథుల్య చంద్ర కుటుంబానికి డాక్టర్‌గా పరిచయం ఉండటంతో, ఆమె మేనత్త ఆరోగ్యం బాగాలేదని చెప్పగానే డాక్టర్ వెంటనే ఆ ఫ్లాట్‌కు వెళ్లారు.

కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు మోసం బయటపడింది. ఆ ఫ్లాట్‌లో నటి అథుల్య చంద్ర, నటుడు అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బిబిన్ పెరుంపిళ్లైతో పాటు మరో 12 మంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు.అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగానే డాక్టర్‌ను బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి, గదిలో బందీగా ఉంచి భయానక వాతావరణం సృష్టించారు. అంతేకాకుండా, డాక్టర్ వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, ఒక వాచ్, ఇయర్‌పాడ్స్ వంటి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కున్నారు.
ఇది కూడా చదవండి :సీన్ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!
ఈ వివాదాన్ని రాజీ చేసుకోవాలంటే ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత ప్రైవేట్ ఫోటోలు మరియు చాట్‌లను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని తీవ్రంగా బెదిరించినట్లు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన డాక్టర్ జాన్సన్, రెండు రోజుల తర్వాత కడవంత్రా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ కేసులో వెంటనే స్పందించి నటి అథుల్య చంద్ర, బిబిన్ పెరుంపిళ్లై మరియు కె.బి. విష్ణులతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉండగానే, ఈ ఉదంతం మరో కొత్త మలుపు తిరిగింది. అరెస్టయిన నటి తరఫు బంధువైన మరో మహిళ ఇన్ఫోపార్క్ పోలీసులను ఆశ్రయించి డాక్టర్ జాన్సన్‌పై ప్రతిఘటనగా తీవ్రమైన బలాత్కార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.

గతేడాది నగరంలోని ఇన్ఫోపార్క్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో డాక్టర్ జాన్సన్ తనకు మద్యం తాగించి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా, ఆ సమయంలో తన అశ్లీల చిత్రాలను డాక్టర్ రహస్యంగా రికార్డు చేశారనే అనుమానం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.
ఈ తాజా ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫోపార్క్ పోలీసులు డాక్టర్ జాన్సన్‌పై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ మొత్తం ఘటనలో హానీట్రాప్ కోణం, బ్లాక్‌మెయిల్ వ్యూహం దాగి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ప్రత్యేక బృందాలు పంపించాయి. కేరళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా 9 మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఒకవైపు డాక్టర్ ఇచ్చిన దోపిడీ, కిడ్నాప్, బెదిరింపుల కేసు... మరోవైపు నటి బంధువు ఇచ్చిన అత్యాచార ఆరోపణల కేసుతో ఈ ఉదంతం ఇటు సినీ వర్గాలలోనూ, అటు సాధారణ ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీ రివ్యూ
మీకు నచ్చవచ్చు :మహాశక్తి మూవీ రివ్యూ
[Malayalam Actors Doctor Attack Rape Case Twist, Kochi doctor assault case, Malayalam actress arrested, Athulya Chandra, Dr Johnson Varghese, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]






