Home

»

Latest News

చెప్పిన డేట్ కే 'గాడ్ ఫాదర్'.. పవర్ ఫుల్ లుక్ లో నయన్!

Sep 8, 2022 10:58AM

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' వాయిదా పడే అవకాశముందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్ తో కూడిన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు.

 

మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న 'గాడ్ ఫాదర్'కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సత్యప్రియ జైదేవ్ అనే పవర్ ఫుల్ రోల్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. చీరకట్టులో ఉన్న నయన్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే పోస్టర్ లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5నే విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుందని మేకర్స్ తెలిపారు.

 

 

సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనుండగా.. సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com