Home

»

Latest News

అప్పుడు మెగాస్టార్‌‌కి..ఇప్పుడు నానికి..!

Sep 27, 2016 2:52PM

తనదైన సహజ నటనతో వరుస సూపర్‌హిట్లు ఖాతాలో వేసుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా నాని నటించిన మజ్ను ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 6.27 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందట. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మజ్ను విడుదలకు ముందు విడుదల తర్వాత ఏపీ, తెలంగాణల్లో ఒకటే వానలు. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు.

ఇక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పరిస్థితి మరి ఘోరం..అలా వర్షాలు ముంచెత్తుతున్నా సరే..నాని ఓపెనింగ్స్ కుమ్మేశాడు. ఈ ఒక్కటి చాలు నాని స్టామినా ఎలా పెరుగుతుందో చెప్పడానికి. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైం హిట్ మూవీ జగదేగవీరుడు-అతిలోకసుందరి సమయంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. అంతటి విపత్తులోనూ జనం ఆ సినిమా కోసం ఎగబడ్డారు. మళ్లీ ఇన్నాళ్లకు నాని విషయంలో అలా జరిగింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com