Home

»

Latest News

బాల‌య్య సినిమా రీషూట్‌??

Sep 27, 2016 3:54PM

నంద‌మూరి బాల‌కృష్ణ సెంచ‌రీ సినిమా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి రీషూట్ జ‌రుపుకోంటోంది?  ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌పై బాల‌య్య అసంతృప్తి వెలిబుచ్చాడా?  అందుకే వాటిని మ‌ళ్లీ షూట్ చేస్తున్నారా?  అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాల‌య్య - క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకొంది. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాజ‌ద‌ర్బార్ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో షూటింగ్ మొద‌లుకావాల్సివుంది. అయితే చిత్ర‌బృందం ఈలోగా జార్జియా పన‌య‌మైంది.

ఇది వ‌ర‌కు జార్జియాలో యుద్ద నేప‌థ్యంలో కొన్ని యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని తెర‌కెక్కించారు. వాటి ఫుటేజ్ పై బాల‌య్య అసంతృప్తి వెలిబుచ్చాడ‌ట‌. వాటిని మ‌ళ్లీ తీయాల్సిందే... అని ఆర్డ‌ర్ వేశాడ‌ట‌. దాంతో గ‌త్యంత‌రం లేని ప‌క్షంలో గౌత‌మిపుత్ర టీమ్ జార్జియాకు మ‌ళ్లీ బ‌య‌ర్దేరుతోంది. అక్క‌డ ఇది వ‌ర‌కు తీసిన వార్ ఎపిసోడ్స్‌ని ఈసారి కొత్తగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. ఇలా రీషూట్‌లు పెట్టుకొంటూ పోతే.. అనుకొన్న స‌మ‌యానికి ఈ సినిమా విడుద‌ల అవుతుందా?  లేదా?  అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు. మ‌రి ఈ రీషూట్ల ప్ర‌భావంతో ఆ డేట్ ఇప్పుడు సందిగ్థంలో ప‌డే అవ‌కాశాలున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com