Home

»

Latest News

నరేష్ సరసన స్నేహ ఉల్లాల్

Apr 6, 2011 11:22AM

sneha ullal wallpapers, sneha ullal stills, sneha ullal pics, sneha ullal images, sneha ullal photos, sneha ullal picturesనరేష్ సరసన స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించబోతూందట. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ పోలికలుండే స్నేహ ఉల్లాల్ నటించబోతూందట. ఈ నరేష్ సరసన స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించబోయే సినిమాను కె.యల్.దామోదర్ ప్రసాద్ నిర్మించబోతున్నారట. గతంలో నాని హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, తన శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై "అలా మొదలైంది" చిత్రాన్ని నిర్మించారు ఈ దామోదర్ ప్రసాద్.


ఆ చిత్రం అనూహ్య విజయం సాధించటంతో ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా, ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో దామోదర్ ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఒక్క దర్శకుడనేంటి మిగిలిన నటీనటులూ, సాంకేతిక నిపుణుల వివరాలూ, ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com