Home

»

Latest News

Nara Rohith: తండ్రి కాబోతున్న హీరో నారా రోహిత్..!

May 01, 2026

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ శుభవార్తను రోహిత్ ఇంకా ప్రకటించనప్పటికీ.. ఆయన భార్య శిరీష లెళ్ళ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నారా, లెళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో శిరీష సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నారా రోహిత్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నారా రోహిత్, శిరీష కలిసి 'ప్రతినిధి 2' చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్‌లో వీరి వివాహాం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా హాజరయ్యారు.

హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. గతేడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' సినిమాలో నటిస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com