నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి విభిన్నమైన సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాలో నాని పోషిస్తున్న ‘జడల్’ పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నాని జడలతో కనిపించే లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. అయితే ఈ జడల్ పాత్ర, ముఖ్యంగా ఆ లుక్ వెనుక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘ది ప్యారడైజ్’ విడుదలకు ఒక్కరోజు ముందు శ్రీకాంత్ ఓదెల తన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయనకు చిన్న వయసులో జడలు వేసి ఉన్నాయి. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. నాని ‘జడల్’ పాత్ర లుక్‌కు తన బాల్యమే స్ఫూర్తి అని దర్శకుడు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం: సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!
చిన్నప్పుడు తన తల్లి తనకు ఐదారు సంవత్సరాల వయసు వచ్చే వరకు జడలు వేసి కట్టేదని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. అయితే తాను పెద్దయ్యాక ఆ జడల లుక్‌ను ఎప్పటికీ మర్చిపోలేదట. ఒక కమర్షియల్ సినిమాలో హీరో జడలతో 70 ఎంఎం తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచే ఊహించుకునేవాడినని ఆయన చెప్పారు.
అలా తన చిన్ననాటి ఆలోచనకు ‘ది ప్యారడైజ్’తో రూపం ఇచ్చారు శ్రీకాంత్ ఓదెల. సినిమాలో జడల్ పాత్ర పుట్టుక, అతని జీవితంలో జరిగే పోరాటం కల్పితమైనప్పటికీ.. ఆ పాత్రకు సంబంధించిన జడలు, లుక్ మాత్రం తన చిన్ననాటి అనుభవాల నుంచి తీసుకున్నవేనని దర్శకుడు వెల్లడించారు. ఇప్పుడు తన చిన్ననాటి ఊహలోని హీరోగా నాని కనిపించడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమని తెలిపారు.
అంతేకాదు.. ఈ ఫొటో కేవలం తన చిన్ననాటికి సంబంధించిన జ్ఞాపకం మాత్రమే కాదని, తన ‘ప్యారడైజ్’ అని శ్రీకాంత్ ఓదెల పేర్కొన్నారు. దీంతో నాని ‘జడల్’ లుక్ వెనుక ఇంత వ్యక్తిగతమైన కథ ఉందా అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇక ‘ది ప్యారడైజ్’లో నాని పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చవచ్చు:
|
మహేష్‌బాబును అలా చూసి షాకవ్వాల్సిందే.. రాజమౌళి చేసిన మేకోవర్ అదే! చరణ్, సుకుమార్ మూవీ పూజాకార్యక్రమం డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే |
[Nani The Paradise, Nani Jadal Character, The Paradise Movie, Srikanth Odela, Nani Jadal Look, The Paradise Jadal Look, Nani Latest Movie, Kayadu Lohar, The Paradise Release Date, Nani Srikanth Odela]





