
సినిమా అనేది ఎంత గొప్పదో తెలియడానికి నాచురల్ స్టార్ నాని హీరో కట్ అవుట్ గా తన సత్తా చాటుతూనే ఇప్పడు మరో బిగ్ హీరో కట్ అవుట్ నితిన్ తో అలియాస్ రుక్మిణి నిర్మిస్తున్నాడు. నితిన్ ని ఇప్పుడు వరుస డిజాస్టర్స్ దోస్త్ మేర దోస్త్ తూహే మేరీ జాన్ అంటున్నాయి. అలాంటిది నితిన్ తో నాని మూవీ చేస్తున్నాడంటే అలియాస్ రుక్మిణి కథకి నితిన్ సెట్ అవుతాడని.. అందుకే స్టార్టింగ్ లో తెలుగు సినిమా గొప్పదని చెప్పింది.
ఇటీవల జరిగిన మ్యూజికల్ జామ్ పార్టీలో నాని చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేశాయి. నితిన్ తన క్యారక్టర్ లో జీవించాడని, ముఖ్యంగా 'కృష్ణ' పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉందని నాని ప్రశంసించాడు. 2026 తనకు చాలా ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోతుందని, చిన్నతనంలో భారతీరాజా సినిమాలు చూసినప్పుడు కలిగిన భావోద్వేగాన్ని ఈ కథ తనకి గుర్తు చేసిందని నాని పంచుకున్నారు.
నితిన్ మాట్లాడుతు 'అలియాస్ రుక్మిణి' తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కథలోని స్వచ్ఛతను, భావోద్వేగాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన నమ్మకం ఉంచారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మరిన్ని విశేషాలు మాట్లాడతానని చెబుతూనే, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని నితిన్ స్పష్టం చేశారు. నాని, నితిన్ మధ్య ఉన్న పాత అనుబంధం కూడా ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

తన కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజులను నాని గుర్తు చేసుకున్నారు. తన తొలి రోజుల్లో నితిన్‌తో ఉన్న అనుబంధం ఇప్పుడు నితిన్ కమ్‌బ్యాక్ ప్రయాణంలో తాను భాగస్వామిగా మారేలా చేసిందని నాని చెప్పడం విశేషం.
ఇది కూడా చదవండి: అసలు BGM అంటే ఏంటి? తెలుగు సినిమాలకి ఇదే అసలైన బలమా!
దీపావళికి ముందు విడుదలైన యంగ్ కృష్ణ లుక్ గ్లిమ్ప్స్కు, అలాగే 'రుకు రుకు రుక్మిణి' పాటకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'రుకు రుకు రుక్మిణి' లిరికల్ వీడియో ఇప్పటికే 5.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.మురళి కాంత్ దేవసోత్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాని సోదరి దీప్తి గంట యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుంది.

కథానాయికగా ఆఫియా సయ్యద్ నటిస్తుండగా, ఆమెకు తప్పకుండా మంచి స్టార్డమ్ వస్తుందని నాని జోస్యం చెప్పారు. సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ప్రధాన బలంగా నిలవనున్నాయి. డిసెంబర్ 4 వరల్డ్ వైడ్ రిలీజ్.
మీకు నచ్చవచ్చు:అల్లు అర్జున్ రాకాకి ధనుష్ ఓం షాక్ ఇచ్చిందా!
మీకు నచ్చవచ్చు:ప్రముఖ నిర్మాతని 14 కోట్లకి ముంచేశారు!
[Nithiin, Nani, Alias Rujmini, Aafiya Sayed, Tollywood]




