Home

»

Latest News

ఒకే అవార్డుల వేడుకలో కమల్ హాసన్‌, జేమ్స్ కామెరాన్‌, టేలర్ స్విఫ్ట్‌.. విజేతలు వీళ్లే!

Nov 21, 2026 3:23PM

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2026 అవార్డుల విజేతల జాబితా విడుదలైంది. భారతీయ సినిమా, హాలీవుడ్‌, సంగీతం, ఓటీటీ, టెలివిజన్‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ జాబితాలో విశ్వనటుడు కమల్ హాసన్‌, హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌, పాప్‌ సింగర్‌ టేలర్ స్విఫ్ట్‌ పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవంబర్‌ 20న నిర్వాహకులు ఈ విజేతల వివరాలను ప్రకటించారు.

భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ కమల్ హాసన్‌కు అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పురస్కారం లభించింది. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజాకు సంగీత రంగంలో విశేష కృషికి గుర్తింపుగా అవార్డు ప్రకటించారు. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌కు గ్లోబల్ సినిమాకు చేసిన సేవలకు గానూ అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ గ్లోబల్ సినిమా పురస్కారం దక్కింది. ఇక పాప్‌ సింగర్‌ టేలర్ స్విఫ్ట్‌ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. భారతీయ స్టాండప్‌ కమెడియన్‌ సమయ్ రైనాకు కమెడియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

ఇది కూడా చదండి: రాకాకి ఓం మూవీ గండం: ఇదేం లాజిక్ అనుకోవద్దు: మ్యాటర్ మొత్తం ఫ్యాన్స్‌కి తెలుసు!

ఇక సినిమాల విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాలో నటనకు రణ్‌వీర్ సింగ్‌ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. ‘సైయారా’ చిత్రంలో నటనకు అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపికైంది. అదే సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ‘కాంతార: చాప్టర్‌ 1’ విమర్శకుల ఉత్తమ చిత్రంగా నిలవగా, ఆ సినిమాలో నటనకు రిషబ్ శెట్టికి క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ‘అవతార్‌: ఫైర్ అండ్ యాష్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది. ‘సిన్నర్స్‌’ సినిమాలో నటనకు మైఖేల్ బి. జోర్డాన్ అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు.

అలాగే ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌’ వెబ్‌ సిరీస్‌కు పలు విభాగాల్లో గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌కు ఆర్యన్ ఖాన్ ఉత్తమ వెబ్‌ సిరీస్ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ‘పాతాళ్ లోక్‌’ సీజన్‌ 2లో నటనకు జైదీప్ అహ్లావత్‌కు ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఇక ఈ అవార్డుల పేరులో దాదాసాహెబ్ ఫాల్కే ఉన్నప్పటికీ, ఇవి భారత ప్రభుత్వం అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కావు. ప్రైవేట్ సంస్థ నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు మాత్రమే. ఈ రెండింటి మధ్య తేడాను ప్రేక్షకులు గమనించాలి.

మీకు నచ్చవచ్చు:

పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు కావ్య మారన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ బాక్స్.. అందులో ఏముందంటే.? 

నమ్మించి అడ్డంగా 14 కోట్ల రూపాయలకి ముంచేశారు: GOAT నిర్మాత చంద్రశేఖర్రెడ్డి!

 

 

 

[DadasahebPhalkeInternationalAwards, KamalHaasan, JamesCameron, TaylorSwift, GlobalAward] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com