Home

»

Latest News

మెగాస్ట‌ర్ టైటిల్‌కి న్యాయం చేసేది ఎవరు..?

Mar 5, 2019 2:38PM

కొన్ని టైటిల్స్ కొంత మందికే సూట‌వుతాయి. ఒక సారి ఒక టైటిల్ తో హిట్ కొట్టి మ‌ళ్లీ ఆ టైటిల్ తో సినిమా చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అలాంటిది ఇక మెగాస్ట‌ర్ సినిమా టైటిల్స్ వాడుకోవాలంటే ఆ హీరోకు, డైర‌క్ట‌ర్ కు గ‌ట్స్ ఉండాల్సిందే. ఇటీవ‌ల నాని , విక్ర‌మ్ కె కుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న చిత్రానికి మెగాస్ట‌ర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్` టైటిల్ ని క‌న్ ఫ‌ర్మ్ చేశారు.  గ్యాంగ్ లీడ‌ర్ సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిన చిత్రం. మ‌రి అలాంటి టైటిల్ తో సినిమా చేయ‌డం అంటే సాహ‌స‌మే అని చెప్పాలి. నాని మాత్రం చిరంజీవి గారి టైటిల్ని ఏ మాత్రం బ్యాడ్ చేయ‌డ‌కుండా ఆ పేరుని నిల‌బెట్టేలా సినిమా ఉంటుంద‌ని చెప్పుకొస్తున్నాడు. మ‌రి ఇది ఇలా ఉంటే...ఇట‌వ‌ల `దేవ్` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కార్తి త‌న త‌దుప‌రి చిత్రాన్ని రెమో ఫేమ్ భాగ్య‌రాజ్ క‌న్న‌న్ డైరక్ష‌న్ లో చేయ‌డానికి రెడీ అయ్యాడు. ర‌ష్మిక మండ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మార్చి ఆఖ‌రులో ప్రారంభం కానుంది. ఇది కాకుండా మ‌రో చిత్రాన్ని కూడా కన‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించ‌నున్నాడు కార్తి. యాక్ష‌న్ ఎంట‌న్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి `ఖైదీ` టైటిల్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉన్న‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి లైఫ్ కే గొప్ప మ‌లుపు `ఖైదీ` చిత్రం . మ‌రి అలాంటి టైటిల్ తో కార్తి వ‌స్తున్నాడు. చూద్దాం మెగాస్టార్ టైటిల్ కి  నాని న్యాయం చేస్తాడో లేక కార్తి న్యాయం చేస్తాడో.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com