Home

»

Latest News

అంత‌క‌న్నా ముందే `లక్ష్మీస్ ఎన్టీఆర్` వ‌స్తోంది!!!

Mar 5, 2019 2:54PM

 కాంట్ర‌వ‌ర్సీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ డైర‌క్ష‌న్ లో  వ‌స్తోన్న లేటెస్ట్ చిత్రం ` ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`. ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలో ని పాట‌లు, ట్రైల‌ర్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.  ఎన్టీఆర్ బ‌యోపిక్ అనుకున్నంత‌గా ఆడని కార‌ణంగా ఇప్పుడు అంద‌రి చూపు లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఇటీవ‌ల మార్చి 22న విడ‌దుల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు అనుకున్న దానిక‌న్నా ముందే రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నార‌ట చిత్ర యూనిట్‌. సినిమాకు వ‌చ్చిన క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. అందుకే ప్ర‌జంట్ పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబ‌ట్టి ఈ నెల 15న సినిమాను రిలీజ్ చేయాల‌ని చిత్ర బృదం భావిస్తోంద‌ట‌.  ఇలాంటి సమ‌యంలో అయితేనే ఎక్కువ థియేట‌ర్స్ దొర‌క‌డంతో పాటు క‌లెక్ష‌న్స్ కూడా భారీగా వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.  ఇక మార్చి 22న ప్రేమ‌క‌థా చిత్రంతో పాటు, అల్లు శిరీష్ న‌టించిన ఎబిసిడి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అందుకే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఒక వారం ముందుగానే రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com