నందమూరి వంశం మూడోతరం నటవారసుడు మోక్షజ్ణ వెండితెర రంగప్రవేశం కోసం నందమూరి అభిమానులందరూ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. మనోడిక హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ ఫిక్సయిపోయిన తరుణంలో.. తన తండ్రి నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో సినిమా అయిన "గౌతమిపుత్ర శాతకర్ణి"లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకోవడానికేమో అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతోపాటు బాలకృష్ణ చిన్న కొడుకుగా ఓ ముఖ్యభూమిక కూడా పోషించనున్నాడట ఈ నందమూరి యువరత్న. పెద్ద కొడుకుగా నారా రోహిత్ నటించనున్న ఈ సినిమాలో చిన్న కొడుకుగా మోక్షజ్ణ కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ.. క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. సో, నందమూరి అభిమానులు "గౌతమీపుత్ర శాతకర్ణి" ఓ విందు భోజనం లాంటిదన్నమాట. వెండితెరపై బాలకృష్ణ-మోక్షజ్ణ ఒకేసారి తెరపై కనపడితే థియేటర్లు పేపర్లతో నిండిపోవడం, థియేటర్లో ఈలల గోలకు బాక్సులు బద్దలయిపోవడం ఖాయం!
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శాతకర్ణిలో మోక్షజ్ణ రోల్ ఏంటంటే..!!
Jun 29, 2016 3:07PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






