Home

»

Latest News

ఆ టైపు సినిమా చేయాలనుంది!

Jun 29, 2016 3:13PM

ఇండస్ట్రీలో వచ్చాక ఏ హీరోయిన్ అయినా "ఎటువంటి సినిమాలు చేయాలనుంది?" అని మీడియావారు అడిగితే.. ఏ రోమాంటిక్ సినిమానో, హారర్ సినిమానో చేయాలనుందని చెబుతారు. కానీ.. శ్రీలంక సుందరి జాక్వాలిన్ మాత్రం "నాకు సెక్స్ కామెడీ సినిమాలో నటించాలని ఉంది" అంటోంది. మళ్ళీ అక్కడ ఓ మెలిక పెట్టిందండోయ్.. దర్శకుడు ప్రతిభాశాలి అయితేనే సదరు సెక్స్ ఎంటర్ టైనర్ లో నటిస్తుందట లేకపోతే చేయదట. చేసేదే చెత్త సినిమా అయినప్పుడు దానికి మంచి దర్శకుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి.  ఇకపోతే.. జాక్వాలిన్ ప్రస్తుతం సల్మాన్ సరసన మరోమారు నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది. ఈ భామ నటించిన తాజా చిత్రం "డిష్యూమ్" విడుదలకు సిద్ధంగా ఉంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com