మరోసారి డ్యూయెల్ రోల్ లో నందమూరి హీరో!!
on Apr 2, 2019
ఇటీవల విడదులైన యాక్షన్ థ్రిల్లర్ `118` తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కేసాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అయితే ఆ ఉత్సాహంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఈ యంగ్ హీరో. వేణు మల్లిడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా రకుల్ ప్రీతి సింగ్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించనున్నరట. అయితే దీనికి `తుగ్లక్` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కళ్యాన్ రెండు డిఫరెంట్ క్యారక్టర్స్ లో కనిపిస్తాడని వినిపిస్తోంది. హరేరామ్ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటించాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత చేస్తోన్న సినిమా ఇదే అవుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలున్నాయి.