Home

»

Latest News

కళ్యాణ్ రామ్ కామెడీ చూతము రారండి

Nov 24, 2016 4:56PM

నందమూరి కళ్యాణ్ రామ్‌..ఎవరు అవకాశాలిచ్చినా ఇవ్వకపోయినా, హిట్లు వచ్చినా రాకపోయినా తన దారిన తాను సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇజం సినిమా డిజాస్టర్ అవ్వడం కళ్యాణ్‌ని కోలుకోలేని దెబ్బ తీసింది. అయినా సరే కొత్త రకం కథలు ఎంచుకోవడం, కొత్త ప్రయత్నాలు చేయడం మాత్రం రామ్ ఆపడం లేదు. ఇప్పటి వరకు మాస్ కమర్షియల్ చిత్రాలే చేసిన కళ్యాణ్ రామ్ గేర్ మార్చాడు. తన కెరిర్‌లోనే ఇప్పటి వరకూ నటించని కామెడీ జోనర్‌ ట్రై చేస్తానంటున్నాడు. దీనిలో భాగంగా కామెడీ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ గతంలో "పటాస్" లో కామెడీ చేసినప్పటికీ అది ఫుల్ లెంగ్త్ కాదు. కానీ ఈ సారి మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో మన ముందుకు రాబోతున్నాడు. చుద్దాం కళ్యాణ్ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించగలడో.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com