Home

»

Latest News

జనతా గ్యారేజ్‌లో ఉన్న లోపమేంటి..?

Nov 24, 2016 3:42PM

ఈ ఏడాది తెలుగులో బ్లాక్‌బస్టర్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్. సినిమా విడుదల రోజు వచ్చిన నెగిటివ్ టాక్ చూసి..ఇక అయిపోయిందిలే అనుకున్నారంతా కానీ..వాస్తవంలో జరిగింది వేరు. విడుదలైన మూడు రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత వేగంగా 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది గ్యారేజ్. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు అన్ని మాస్ ఎలిమెంట్స్‌ను వండి వార్చడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. అయితే అలాంటి ఈ సినిమాలో కొన్ని లోపాలున్నాయట.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. స్వయంగా జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ.

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా ఫంక్షన్‌కు కొరటాల హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి, పాత్రలు బాగా కుదరాలి. కానీ నేను తీసిన జనతా గ్యారేజ్‌ విషయంలో అలా జరగలేదు. ఆ సినిమాలో కొన్ని లోపాలున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరటాల ఎవరిని ఉద్దేశిస్తూ అన్నాడో..లేక తనను తానే విమర్శించుకున్నాడో కానీ ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com