Home

»

Latest News

కల్యాణ్ రామ్ కామెంట్ల‌కు ఆయ‌న హ‌ర్ట‌య్యాడు

Oct 18, 2016 11:53AM

సాధార‌ణంగా క‌ల్యాణ్ రామ్ వివాదాల‌కు దూరంగానే ఉంటాడు. ఆడియో ఫంక్ష‌న్ అయినా, ఇంట‌ర్వ్యూల‌లో అయినా ఆచి తూచి మాట్లాడ‌తాడు. అలాంటి కల్యాణ్ రామ్ వ్యాఖ్య‌లే ఇప్పుడు ఒక‌రి  మ‌న‌సు నొప్పించ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. క‌ల్యాణ్ రామ్ కామెంట్ల‌కు నొచ్చుకొంటున్న‌వాళ్లెవ‌రో కాదు.. వ‌క్కంతం వంశీ.  క‌ల్యాణ్ రామ్‌కీ వ‌క్కంతం వంశీకీ చాలా మంచి రిలేష‌న్ షిప్ ఉంది. ఆ మాట‌కొస్తే ఎన్టీఆర్‌కీ వ‌క్కంతం చాలా క్లోజే.  ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ - వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా సెట్ చేశాడు క‌ల్యాణ్ రామ్‌. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు న‌లుగుతూనే ఉంది. కానీ ముందుకు జ‌ర‌గ‌డం లేదు.

చివ‌రికి ఈ వెయింటింగ్ త‌ట్టుకోలేక వ‌క్కంతం వంశీ నంద‌మూరి కాంపౌండ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. వ‌క్కంతం వంశీ సినిమా ఎందుకు ఆగిపోయింది?  అని అడిగితే.. 'ఆగ‌లేదు.. త్వ‌ర‌లో ఉంటుంది' అని చెప్ప‌కుండా .. 'క‌థ న‌చ్చ‌లేదు.. అందుకే వ‌ద్ద‌నుకొన్నాం' అంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు క‌ల్యాణ్ రామ్‌. దాంతో..వక్కంతం బాగా హ‌ర్ట‌య్యాడని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  క‌థ న‌చ్చ‌క‌పోతే మూడేళ్లు త‌న‌ని ఎందుకు తిప్పుకొన్నారు?  అంటూ వ‌క్కంతం స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట‌. సినిమా ఆగిపోతే.. ఏదో ఓ కార‌ణం చెప్పాలి గానీ, ఓ ర‌చ‌యిత కెరీర్‌పై ప్ర‌భావం ప‌డేలా ఇలా మాట్లాడ‌డ‌మేంటి? అంటూ బాధ‌ప‌డుతున్నాడ‌ట వ‌క్కంతం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com