Home

»

Latest News

Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్ క్రేజ్.. క్యూలో 8 మంది దర్శకులు, 10 మంది నిర్మాతలు!

May 03, 2026

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'నందమూరి బాలకృష్ణ' (Nandamuri Balakrishna) పేరు ఒక సెన్సేషన్. వయసు పెరుగుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కోసం.. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర చిత్ర పరిశ్రమల దర్శకులు, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు.

ఎనిమిది మంది దర్శకులు.. పది మంది నిర్మాతలు!
ప్రస్తుతం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు బాలయ్య కోసం కథలను సిద్ధం చేసుకుని వేచి చూస్తున్నారు. వీరిలో టాలీవుడ్ దర్శకులతో పాటు ఇతర భాషల దర్శకులు ఉండటం విశేషం. కన్నడ, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ముగ్గురు క్రేజీ దర్శకులు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా యాక్షన్ స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం దర్శకులే కాదు, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని నమ్ముతున్న పది మందికి పైగా నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ బాలయ్యతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారట.

లైన్ లో క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి స్క్రిప్ట్ లు రెడీ చేసే పనిలో ఉన్నారు.

ఒకప్పుడు సీనియర్ హీరోల మార్కెట్ పడిపోతుందని భావించిన వారందరికీ తన సక్సెస్‌తో బాలయ్య గట్టి సమాధానం ఇచ్చారు. మాస్ పల్స్ తెలిసిన హీరో కావడంతో పాటు, అటు బుల్లితెరపై 'అన్‌స్టాపబుల్' షోతో యువతకు కూడా దగ్గరవ్వడం ఆయనకు ప్లస్ అయ్యింది. మరి గోపీచంద్ మలినేని, కొరటాల శివ ప్రాజెక్ట్ ల తర్వాత  బాలయ్య ముందుగా ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com