Home

»

Latest News

ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుక.. తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు!

May 03, 2026

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిశ్చితార్థ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, కోన వెంకట్ తదితరులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

గత నెలలోనే తన కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com