Home

»

Latest News

నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల.!

Jul 22, 2026 3:57PM

నందమూరి బాలకృష్ణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన కొత్త సినిమా 'NBK111' షూటింగ్‌లో పాల్గొంటుండగా ప్రమాదానికి గురయ్యారు. ఒక కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు, ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు.

ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే డాక్టర్ల బృందం, బాలకృష్ణను వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల అనంతరం ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. 

బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో (మజిల్ టేర్) సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయన విస్తృతమైన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నారు. తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు.

 

Nandamuri Balakrishna, Health Bulletin, AIG Hospital, NBK 111

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com