
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తన పాన్ ఇండియా కట్ అవుట్ ని మరింత పెంచుకునేలా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' తో ముస్తాబు అవుతున్న తెలిసిందే. కింగ్ ఖాన్ షారుక్ తో జవాన్ హిట్ తర్వాత అట్లీ నుంచి వస్తున్న మూవీ కూడా 'రాకా' నే కావడంతో అంచనాలు ఒక రేంజ్ లోనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు.
దీంతో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా , పిల్లలు అయాన్, అర్హలతో యూరప్ పర్యటనకి వెళ్లారు. అందులో భాగంగా ఆస్ట్రియాలోని సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉండే ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వత శ్రేణులలో ఉన్న ‘సీగ్రూబ్ టెర్రేస్’ పై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉంది. ఇన్స్‌బ్రక్ (Innsbruck) నగరం సమీపంలోని ప్రసిద్ధ నార్డ్‌కెట్ (Nordkette) పర్వత శ్రేణుల్లో భాగమైన ఈ ఎత్తైన ప్రదేశం నుంచి దిగువన వంకరలు తిరుగుతూ ప్రవహించే ఇన్న (Inn) నది, చుట్టూ అల్లుకున్న అద్భుతమైన పచ్చదనం, మంచు శిఖరాల సుందర దృశ్యాలను ఈ జంట తిలకించింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన స్పెషల్ పిక్స్, క్యూట్ వీడియోలను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయ్యాయి. డార్క్ కలర్ బాంబర్ జాకెట్, కార్గో ప్యాంట్, వైట్ స్నీకర్స్‌లో అల్లు అర్జున్ అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తుండగా, బ్లాక్ నీట్ స్వెటర్, వైడ్-లెగ్ డెనిమ్ అవుట్‌ఫిట్‌లో స్నేహా మెరిసిపోతున్నారు. పచ్చటి కొండల మధ్య అర్హతో కలిసి బన్నీ సరదాగా ఆడుకుంటున్న క్షణాలు అభిమానుల హృదయాలని కొల్లగొడుతున్నాయి.
Also read: జననాయగన్ సెన్సార్ టాక్ అవుట్.. ఎంత పని చేసారంట!
allu arjun, raaka, atlee, allu sneha







