
ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. 75 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అయితే మరణానికి కొన్ని గంటల ముందు ఆయన తన స్నేహితుడికి పంపిన ఓ మెసేజ్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో ఉండగా అక్టోబర్ 8 తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సుమారు 2.30 గంటలకు తనకు ఒంట్లో బాగోలేదని స్నేహితుడికి మెసేజ్ పంపించారు. అయితే అర్ధరాత్రి కావడంతో ఆ మెసేజ్‌ను స్నేహితుడు వెంటనే చూడలేదు. ఆ తర్వాత నానా స్వయంగా ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పడంతో.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నాడు.
నానా ఇంటికి వెళ్లిన స్నేహితుడికి అక్కడ కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించింది. అప్పటికే ఆయన ఒళ్లంతా చెమటలు పట్టి, క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారు. దీంతో వెంటనే అంబులెన్స్ ని పిలిపించి, అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు నానాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 45 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నానా పటేకర్ పంపించిన మెసేజ్‌ను ఆయన స్నేహితుడు వెంటనే చూసి ఉంటే.. మరింత ముందుగానే సహాయం అందేదేమోనన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఆయనను త్వరగా ఆసుపత్రికి తరలించి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రణబాలి ట్రైలర్ లాంచ్‌లో రష్మిక మిస్సింగ్: ఆమె రాకపోవడానికి అసలు కారణమేంటి.?
[Nana Patekar Last Message, Nana Patekar Friend, Nana Patekar Death Reason, Nana Patekar Passed Away, Nana Patekar News, Nana Patekar, Telugu News]




