Home

»

Latest News

మళ్లీ కలిసిన స్టార్ ఫ్యామిలీస్.. నమ్రతా షేర్ చేసిన ఫొటోలు వైరల్.!

Oct 6, 2026 3:13PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ‘గర్ల్ గ్యాంగ్’తో కలిసి సరదాగా గడిపిన సాయంత్రానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మళ్లీ కలిశాం.. స్నేహితురాళ్లతో సరదా సాయంత్రాలు” అంటూ నమ్రతా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోల్లో నమ్రతతో పాటు ఆమె కుమార్తె సితార ఘట్టమనేని, దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్, దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి తదితరులు కనిపించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సన్నిహితులంతా కలిసి రిలాక్స్‌డ్‌గా గడిపినట్టుగా ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో మహేశ్, సుకుమార్, వంశీ పైడిపల్లి కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. గతంలోనూ ఈ కుటుంబాలు కలిసి పలు సందర్భాల్లో సందడి చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ గెట్‌టుగెదర్‌లో సితార ఘట్టమనేని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార.. మోడలింగ్‌తో పాటు డిజిటల్ కంటెంట్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఫ్యాషన్, డ్యాన్స్, ఫొటోషూట్లకు సంబంధించిన పోస్టులతో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ సితార సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

[Namrata Shirodkar, Sitara Ghattamaneni, Mahesh Babu, Namrata Latest Photos, Sitara Latest Photos, Namrata Girl Gang, Sitara Ghattamaneni Photos, Tollywood News, Varanasi Movie, Mahesh Babu Family]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com