చెయ్యి నొప్పి పెడుతోందా నాన్న...నిహారిక ఎమోషనల్ వీడియో
on Sep 23, 2022

ఇటీవల నాగబాబు మూవీస్ లో నటించడం చాలా తగ్గించి బుల్లితెర మీద ఎక్కువగా కనిపిస్తున్నారు. జబర్దస్త్ లో జడ్జిగా కొన్నేళ్లు చేసి ఇప్పుడు మాయమయ్యారు. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఆయన కుడి చేతికి గాయం అయ్యేసరికి దానికి ఒక బాగ్ వేసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఐతే ఏం జరిగింది అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక నిహారిక తండ్రి చాటు బిడ్డ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె నాగబాబు పక్కన కూర్చుని " చెయ్యి బాగా నొప్పి పెడుతోందా..ఆ నొప్పి మొత్తం తీసేయనా అని అడిగేసరికి డాక్టర్లు మందులిచ్చారుగా తగ్గిపోతుందిలే అంటాడు నాగబాబు.
లేదు నేను చెప్తున్నాగా నీ చేతి నొప్పిని తీసేస్తాను అనేసరికి మంత్రం వేస్తావా ఏమిటి అని మళ్ళీ అడిగాడు నాగబాబు. ఏదో చేస్తాను కాను నువ్వు ఆ చేతినే చూస్తూ ఉండు అని ఎడమ చేతిని గట్టిగా కొరికేస్తుంది నిహారిక. అంతే నాగబాబు గట్టిగా అరిచి ఏం చేస్తున్నావ్ అంటాడు. ఆ చెయ్యి నొప్పి పోయింది కదా అంటుంది. ఈ చెయ్యి నొప్పిగా ఉంది కదా అన్నాడు నాగబాబు." ఇలా నాగబాబు చేతి నొప్పిని మరో చేతికి గాయం చేసి తగ్గించింది. ఈ వీడియో నాగబాబు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



