Home

»

Latest News

మూడు సీజ‌న్స్ గా చైతూ వెబ్ - సిరీస్!?

Jan 29, 2022 2:16PM

వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ టాలెంలెడ్ హీరో.. `థాంక్ యూ` చిత్రంతో బిజీగా ఉన్నాడు. `మ‌నం` త‌రువాత వెర్స‌టైల్ కెప్టెన్ విక్ర‌మ్ కె. కుమార్ కాంబినేష‌న్ లో చైతూ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. వీలైతే వేస‌విలో లేదంటే ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో `థాంక్ యూ`ని రిలీజ్ చేసే దిశ‌గా మేక‌ర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. `థాంక్ యూ` త‌రువాత విక్ర‌మ్ కుమార్ తో మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నాడు నాగ‌చైత‌న్య‌. అయితే, ఈసారి సినిమా కోసం కాదు.. ఓ వెబ్ - సిరీస్ కోసం. టైమ్ ట్రావెల్ సిరీస్ గా రూపొంద‌నున్న ఈ వెబ్ - సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. ఇందులో చైతూ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న‌ ఓ జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపిస్తాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ సిరీస్ మూడు సీజ‌న్స్ గా సాగుతుంద‌ట‌. ఒక్కో సీజ‌న్ లో ప‌దేసి ఎపిసోడ్స్ ఉంటాయ‌ట‌. అంతేకాదు.. తొలి సీజ‌న్ ఈ సంవ‌త్సరాంతంలో స్ట్రీమ్ అయ్యే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. 30 ఎపిసోడ్స్ తో సాగే ఈ వెబ్ - సిరీస్ ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com