సమంతను ఎప్పటికీ గౌరవిస్తా.. మళ్ళీ ప్రేమలో పడతా!
on Aug 6, 2022
నాగ చైతన్య, సమంత విడిపోయి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ వారి విడాకుల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్వ్యూలు, టాక్ షోలలో కూడా వారికి విడాకులకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలు వినీ వినీ విసిగిపోయానని చైతన్య అంటున్నాడు.
ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చడ్డా' మూవీలో చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి మరోసారి స్పందించాడు. "మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పాం. కానీ కొందరు ఏవేవో వార్తలు సృష్టిస్తున్నారు. మేం విడిపోయి ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నాం. విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. సమంత చేసే ప్రతి వర్క్ ని చూస్తూనే ఉంటా. ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా. విడాకుల తర్వాత నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఇప్పటికీ విడాకులకు సంబంధించిన ప్రశ్నలే అడిగి విసిగిస్తున్నారు." అని చైతన్య అన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో 'మళ్ళీ మీరు ప్రేమలో పడతారా?' అన్న ప్రశ్నకు "తప్పకుండా పడతాను. భవిష్యత్తులో ఏం జరగనుందో ఎవరికి తెలుసు?. మనిషి జీవించడానికి ఊపిరి ఎంతో అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. మన ప్రేమను పంచాలి, ఎదుటివారి ప్రేమను పొందాలి. అప్పుడే ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉండగలుగుతాం" చైతన్య బదులిచ్చాడు.
Also Read