Home

»

Latest News

9 సినిమాల్లో ఒకే ఒక్క హిట్: అయినా తగ్గని క్రేజ్: ఎందుకని!

Sep 19, 2026 3:04PM

 

 


ఓవర్ నైట్ స్టార్ డమ్ అనేది ఎంత నిజమో, చెప్పుకునే స్థాయిలో సినిమాలు చేసిన హిట్టు అందుకు అలిగిందో తెలియని స్టేజ్ రావడం కూడా అంతే నిజం. అభిమానులు, ప్రేక్షకులని తన చూపు నుంచి తప్పించుకొని విధంగా మెస్మరైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు ఆ స్టేజ్ లోనే ఉంది.


 నభా నటేష్.. శాండల్‌వుడ్‌లో శివ రాజ్‌కుమార్ సరసన 2015లో 'వజ్రకాయ' చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించిన ఈ కన్నడ భామ, 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడి సూపర్ సక్సెస్ సాధించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2018లో సుధీర్ బాబు సరసన 'నన్ను దోచుకుందువటే' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో తన చలాకీతనంతోనూ, ఫ్రెష్ లుక్స్‌తోనూ తెలుగు ప్రేక్షకులని  ఆకట్టుకున్నప్పటికీ విజయం మాత్రం ముఖం తిప్పుకుంది. తన  సినీ ప్రయాణంలో అసలైన బిగ్ టర్నింగ్ పాయింట్ 2019లో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడుతూ,  గ్లామరస్‌గా 'చాందిని' క్యారక్టర్ లో జీవించిన నభా, ఒక్కసారిగా స్టార్ హోదా  సొంతం చేసుకుంది. టాలీవుడ్ వర్గాల్లో మరియు ఆడియన్స్‌లో 'ఇస్మార్ట్ బ్యూటీ'గా పాపులారిటీ దక్కించుకుని కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఆ ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చిన క్రేజ్ ద్వారా ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.

అయితే, సినీ పరిశ్రమలో విజయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 'ఇస్మార్ట్ శంకర్' తదనంతరం ఆమె ఖాతాలో వరుస ప్రాజెక్టులు చేరినప్పటికీ, ఫలితాలు మాత్రం అనుకూలించలేదు. ఇప్పటివరకు నభా నటేష్ తన కెరీర్‌లో మొత్తం 9 సినిమాల్లో నటించగా, అందులో ఏకైక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది కేవలం ఆ ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమేనని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్', 'సోలో బ్రతుకే సో బెటర్', 'మాస్ట్రో' వంటి వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి.


ఇది కూడా చదవండి: వారం రోజుల్లో: మహేష్ బాబు 'వారణాసి' ఇంట్రో సీన్ ఊచకోత..రాజమౌళి స్కెచ్ వైరల్

 


కెరీర్ మంచి స్పీడ్‌లో ఉండి అవకాశాలు వస్తున్న సమయంలోనే నభా జీవితంలో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆమె తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 2 ఏళ్ల పాటు కెమెరా ముందుకు రాకుండా, నటనకు పూర్తిగా దూరమై బెడ్ రెస్ట్‌కే పరిమితం కావలసి వచ్చింది. అనేక శస్త్రచికిత్సలు, కఠినమైన ఫిజియోథెరపీ సర్జరీల తర్వాత, తన ఆత్మవిశ్వాసంతో ఆ శారీరక, మానసిక బాధలను అధిగమించి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇటీవల  జూలై 3న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రంలో ప్రాముఖ్యత గల క్యారక్టర్ పోషించప్పటికి  ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక నేపథ్య చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ క్యారక్టర్ లో ఒదిగిపోయి నటించడం వల్లనే ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం అత్యధిక   ఫాలోవర్లను కలిగి ఉంటూ తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో ట్రెండింగ్‌ మాత్రం 'నా ఇంటి పేరు' అని ఫ్యాన్స్ కి హామీ ఇస్తూ ఉంది. 

 

మీకు నచ్చవచ్చు: తెలుగు సినిమా డైలాగుల ప్రయాణం: ఏమంటివి ఏమంటివి నుండి నేటి మాస్ పంచ్‌ల వరకు!

 

 

[Nabha Natesh Nabha Natesh Movies Hit And Flop Story, Swayambhu Movie, iSmart Shankar, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com