Home

»

Latest News

భూ కబ్జా: ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ పై కేసు నమోదు.!

Sep 19, 2026 3:02PM

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలోని తమ ల్యాండ్ కబ్జా చేశారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువు ప్రాంతంలో సీయాట్ సొసైటీకి సంబంధించిన ప్లాట్స్ ఉన్నాయి. సర్వే నెంబర్ 12, 12ఏ, 13 గుట్టల బేగంపేట్ లో తమ సొసైటీ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ చెబుతున్నారు. అయితే, ఈ రోజు ఉదయం నిర్మాత సి. కళ్యాణ్ తన అనుచరులతో కలిసి ల్యాండ్ లోకి అక్రమంగా ప్రవేశించారనేది ఆరోపించారు. సొసైటీకి చెందిన స్థలంలో అక్రమంగా బ్లూ షీట్స్ వేసి, అసలు ప్లాట్ ఓనర్లు ఎవరూ కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 37 సీక్రెట్ ఇదే.. అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.!

గతంలో కూడా కొందరు వ్యక్తులు ఈ ప్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నించారని సొసైటీ సభ్యులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తులు వెనక్కి తగ్గారని, కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఏకంగా సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, ఆయనతో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులు కలిసి తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు కుట్ర పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీసులను కోరారు.

మీకు నచ్చవచ్చు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా.. 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!

 

 

 

[C Kalyan Land Grabbing Case, C Kalyan Land Dispute Case, Producer C Kalyan, Hyderabad Land Grabbing Case, Madhapur Land Grabbing Case, Madhapur Police Station, CEAT Society Madhapur, Sunnam Cheruvu Land Dispute, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com