
సినీ పరిశ్రమలో ఒక సాంగ్ లేదా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకుని, ఆ తర్వాత స్లో పాయిజన్‌లా ఎక్కి సూపర్ హిట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి అద్భుతాన్నే చేసి చూపిస్తున్నాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankar). ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన 'డ్యూడ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్రేక్ అందుకున్న సాయి అభ్యంకర్.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను తన ట్యూన్స్‌తో ఊపేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈయన కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్స్ విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.
ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన 'కరుప్పు' (Karuppu) సినిమా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు. అయితే సినిమా విడుదల కాకముందు, అలాగే విడుదలైన కొత్తలో ఈ సినిమాకు ఆయన అందించిన ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ మ్యూజిక్ అస్సలు బాలేదంటూ పెదవి విరిచారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సాయి అభ్యంకర్ అందించిన ఆ స్లో పాయిజన్ ట్రాక్స్ నెమ్మదిగా జనాల్లోకి ఇంకిపోయి, ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో 'కరుప్పు' సినిమా మ్యూజిక్ బిట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని 'ఊరుమ్ బ్లడ్' (Oorum blood) అనే ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాను రూల్ చేస్తోంది.
గతంలో సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించించిన 'డ్యూడ్' సినిమా విషయంలో కూడా మొదట్లో ఇలాగే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాతే అది బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 'కరుప్పు' సినిమాతో సాయి అభ్యంకర్ ఫార్ములా మరోసారి వర్కవుట్ అయిందని, ఆయన ఒక అద్భుతమైన స్లో పాయిజన్ కంపోజర్ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రోల్స్ చేసిన నోళ్లతోనే ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ అని పిలిపించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
సాయి అభ్యంకర్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు పని చేస్తున్నాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) చిత్రానికి సాయి అభ్యంకరే సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్, సాయి అభ్యంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాకా' ఆల్బమ్ ఇండియన్ సినిమాను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






