Home

»

Latest News

Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం

May 22, 2026

 

మండే ఎండల్ని సైతం లెక్కచెయ్యకుండా పలు తాజా తెలుగు సినిమా వార్తలు మీ ముందుకి వచ్చాయి


1 .పెద్ది స్పెషల్ సాంగ్ వచ్చేస్తుంది 

'పెద్ది' స్పెషల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మేకర్స్ స్పెషల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. 'హెల్లాళ్లాలో' అనే లిరిక్ తో స్టార్ట్ అయిన సాంగ్  విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో మెగా ఫ్యాన్స్‌, మాస్ ఆడియెన్స్ కి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి సాంగ్  రేపు రిలీజ్ కానుంది. చరణ్, శృతి హాసన్ స్టెప్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి.

2 . బాహుబలి ఫ్లాప్ అయి ఉంటే... తమన్నా షాకింగ్ కామెంట్స్

ఇండియన్ సినీ పరిశ్రమలో బాహుబలికి ఉన్న స్థానం  తెలిసిందే. 'బాహుబలి'కి ముందు, బాహుబలికి తర్వాత అని కూడా భారతీయ చలనచిత్ర చరిత్రని విభజించవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ,బాహుబలి 'ది బిగినింగ్' చిత్రాన్ని సుమారు 200  కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ సమయంలో ప్రాంతీయ భాషా చిత్రానికి అంత భారీ మొత్తంలో పెట్టుబడి  అనేది ఒక రకమైన జూదమే. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయి ఉంటే, ఇండస్ట్రీలోనే ఒక పెద్ద విపత్తు సంభవించేది. నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోయేవారనే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

3 .సంచలనం సృష్టిస్తున్న రామాయణ థియేట్రికల్ రైట్స్.. షారుక్ ని దాటి మరి

రామాయణ  థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేవలం హిందీ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసమే నిర్మాత నమిత్ మల్హోత్రా  450 కోట్ల రూపాయల భారీ ధరని చెప్తునట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ “కింగ్” థియేట్రికల్ హక్కులు సుమారు 250 కోట్ల రూపాయల రికార్డు ధరకి అమ్ముడయ్యాయి. 

4 . జైలర్ 2 డేట్ ఫిక్స్ అయ్యిందా!

సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులు జైలర్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నంత ఇదిగా మరో చిత్రం కోసం ఎదురుచూడటం లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన భారీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు రెండో వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని  10 లేదా 11వ తేదీ ఫిక్స్ అయ్యారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

5 . 'పెద్ది' రికార్డుల వేట.. ఓవర్సీస్‌లో ఊచకోత!

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే ఇప్పటికే 15,000 కంటే ఎక్కువ టిక్కెట్లని  విక్రయించి సంచలనం సృష్టించింది. నార్త్ అమెరికాలో దాదాపు 467 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఏకంగా $430,000 డాలర్స్ అంటే  మన కరెన్సీలో దాదాపు  కోట్లు. ఇందులో కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రధాన రాష్ట్రాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్  UK లో కూడా ‘పెద్ది’ హవా గట్టిగానే నడుస్తోంది. ఇప్పటికే 7,500 కంటే ఎక్కువ టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సేల్ అయ్యాయి. 

6 .పెద్ది కోసం రంగంలోకి బాలయ్య 
 పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 2 న హైదరాబాద్ లో భారీ స్థాయిలో నిర్వహించటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడనే న్యూస్ సినీ సర్కిల్స్ లో హై ప్రొఫైల్ హోదాలో చక్కర్లు కొడుతుంది. మరి బాలయ్య వస్తే ఇరువురి ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్టే. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న మూవీని పెద్ది నిర్మాణ సంస్థనే నిర్మిస్తుంది.

7 .AK47 లోకి నివేదా పేతురాజ్ ఎంట్రీ!

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆదర్శ కుటుంబం AK47' . షూటింగ్ దశలో ఉండగా టీంలో  గ్లామరస్ బ్యూటీ నివేదా పేతురాజ్ కూడా జాయిన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే నివేదాకి మంచి అవకాశమని చెప్పవచ్చు.  వెంకీ సరసన కేజిఎఫ్ భామ శ్రీనిధి జత కడుతున్న విషయం తెలిసిందే

8 .తమిళ దర్శకుడికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!

యువసామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో  చైతు వర్క్ చేయబోతున్నట్టు  ఫిలింనగర్ వర్గాల్లో టాక్.  'ఆనందం', 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్స్ లింగుస్వామి నుంచి వచ్చాయి. మరి ఈ కాంబో సెట్ అయితే క్రేజీ ప్రాజెక్ట్ గా మారే అవకాశం ఉంది.

9 . గాయపడ్డ సింహం ఓటిటి డేట్ వచ్చేసింది 

 మే 1 న సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన మూవీ గాయపడ్డ సింహం.తరుణ్ భాస్కర్,  ఫరియా అబ్దుల్లా,  జేడీ చక్రవర్తి. మానస చౌదరి ముఖ్యమైన క్యారెక్టర్స్ లు పోషించారు. శ్రీ విష్ణు గెస్ట్ రోల్ లో కనిపించడం ఈ చిత్రం స్పెషాలిటీ. మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఎలాంటి ముందస్తు హడావుడి, అనౌన్స్‌మెంట్‌ లేకుండా  సైలెంట్‌గా ఓటీటీలోకి  వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది 

10 . థియేటర్స్ లో సినీ పండుగ 

అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, పురుషః అనే మూడు వైవిద్యభరితమైన చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ ఈ రోజు థియేటర్స్ లోకి  వచ్చాయి.మరి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com