మ్యూజిక్ డైరెక్టర్ జీవితంతో ఆడుకొన్న వర్మ
on Dec 26, 2016
నాకు నేను తప్ప ఇంకెవ్వరూ ముఖ్యం కాదంటుంటాడు వర్మ. దానికి తగ్గట్టే తన స్వార్థం కోసం ఎవరి జీవితాలతో అయినా ఫుట్‌బాల్ ఆడేసుకొంటుంటాడు. తాజాగా మరో ఉదాహరణ దొరికింది. వర్మ కొత్త చిత్రం వంగవీటి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిపోర్ట్, వివాదాలూ పక్కన పెడితే.. 'నన్ను వర్మ దారుణంగా అన్యాయం చేశాడు' అంటూ ఓ సంగీత దర్శకుడు మీడియా ముందు వాపోతున్నాడు. తనే.. రాజశేఖర్. వంగవీటి సినిమా కోసం రాజశేఖర్ కూడా పని చేశాడు. నిజానికి ఈ సినిమాకి రవి శంకర్ సంగీత దర్శకుడు. ఓ పాట మాత్రం రాజశేఖర్ చేత ట్యూన్ చేయించారు. వర్మ పాడిన 'వంగవీటి. వంగవీటి' టైటిల్ సాంగ్ రాజశేఖర్ ట్యూన్ చేసిందే. అయితే ఈ పాటకు తనకు ఎలాంటి క్రెడిడ్స్ ఇవ్వలేదని, టైటిల్స్‌లో తన పేరు చూపించలేదని, దయ చేసి ఆ పాటని తీసేయ్యమని.. వర్మని అభ్యర్థించుకొంటున్నాడు రాజశేఖర్. వీటిపై వర్మ కూడా స్పందించాడు. ట్విట్టర్లో రాజశేఖర్ పేరు ప్రస్తావించానని, వంగవీటి ఆడియో ఫంక్షన్‌కి కూడా రాజశేఖర్‌కి పిలిచానని చెప్పుకొచ్చాడు. కొన్ని కారణాల చేత.. అనుకోకుండా ఆ పేరు మిస్ అయి ఉంటుందని, దాన్ని పెద్దది చేయడం బాలేదంటున్నాడు. అంతేకాదు.. 'వంగవీటి' ట్యూను కూడా రాజశేఖర్ ది కాదని, దాని ఒర్జినల్ ట్యూన్ `వంగవీటి` సంగీత దర్శకుడు రవి శంకర్‌దే అంటున్నాడు వర్మ.