తిరుపతిలో మొదలైన శాతకర్ణి సందడి
on Dec 26, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుక తిరుపతిలోని జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో అట్టహాసంగా జరుగుతోంది. ఆడియో వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే స్టేడియం నిండిపోవడంతో బయటఉన్న వారి కోసం భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వేదిక చుట్టూ ఎన్టీఆర్, బాలకృష్ణ కటౌట్లతో పాటు సీఎం చంద్రబాబు నాయుడి కటౌట్లను ఏర్పాటు చేశారు. నందమూరి అభిమానుల కేరింతలతో తిరుపతి కళకళలాడుతోంది.
Also Read