Home

»

Latest News

మనవి పిల్లలు చూసే సినిమాలు కాదా..?

Nov 10, 2016 2:52PM

శక్తిమాన్ అంటే ఈ తరం వాళ్లకి తెలియదు కానీ..భారత్‌లో టీవీ ఛానెళ్లు అంతగా లేని రోజుల్లో దూరదర్శన్‌లో ఈ సూపర్‌హీరో చేసిన అల్లరిని నాటి తరం ఏనాటికీ మరచిపోదు..ఆ పాత్ర పోషించిన వ్యక్తిపేరు ముఖేష్ ఖన్నా..1997-2005ల మధ్యకాలంలో ఆయన ప్రభ ఓ రేంజ్‌లో వెలిగిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా అలరించారు ముఖేష్. ప్రస్తుతం ఆయన చిల్డ్రన్స్ ఫిల్మ్ సోసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం భారతీయ చిత్రాల్లో చిన్నారులు చూడదగ్గ కథలు ఉండట్లేదు. పిల్లలు ఏవైతే చూడకూడదో అవే చూస్తున్నారు. టీవీల్లో అత్తా..కోడళ్ల సీరియళ్లు లేదా యాక్షన్ సినిమాలు చూస్తున్నారు. అవి వారు చూడదగ్గ సినిమాలు కాదు. అందుకే బాధ్యత గల పదవిలోకి వచ్చాకా ఒక నిర్ణయం తీసుకున్నా..చిన్నారుల కోసం తీసిన సినిమాలు బాలల చలన చిత్రోత్సవాల సమయంలోనే కాకుండా థియేటర్లలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నాం. అలాంటి సినిమాలు థియేటర్లలో విడుదల అవ్వకపోతే..చిన్నారుల వరకు చేరలేవని అన్నారు ముఖేష్ సారీ మన శక్తిమాన్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com