Home

»

Latest News

మరో సినీ జంట విడిపోయిందట..?

Nov 10, 2016 4:26PM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమకు చెందిన కపుల్స్ తెగ విడిపోతున్నారు. ఎఎల్. విజయ్-అమలాపాల్, కమల్-గౌతమిల జంటలు తెగదెంపులు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో జంట చేరింది. చాలా రోజుల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సల్మాన్ ఖాన్-యులియా పంతూర్‌లు విడిపోయారట. ఈ జంట చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని... తాజాగా వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అలాంటిది ఉన్నట్లుండి సల్మాన్-యులియాలు ఎందుకు విడిపోయినట్లు..వీరిద్దరి మధ్య కల్చరల్‌గా, ఎమోషనల్‌గా చాలా మనస్పర్థలు వచ్చాయట..

అప్పటికీ యులియా సల్మాన్‌ పార్ట్‌నర్‌ కావడానికి చాలా ప్రయత్నాలే చేసిందట..కానీ అవేవి వర్కవుట్ కాలేదట. అదీ కాకుండా యులియాకు గతంలోనే వివాహమైనట్లు ఆమె భర్తతో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. సల్మాన్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ యులియా తన మాజీ భర్తతో ఇంకా టచ్‌లోనే ఉండటం భాయ్‌కి నచ్చలేదట..దీంతో గత కొంతకాలంగా యులియాను కలవడం, మాట్లాడటం తగ్గించేశాడని అప్పటికీ యులియా మారకపోవడంతో రిలేషన్‌షిప్ బ్రేక్ చేశాడని బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు ఇద్దరు స్పందించలేదు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com