Home

»

Latest News

Srinivasa Mangapuram: ఏంటి సామి ఆ యాక్టింగ్...ఆ హీరో అభిమానుల హంగామా 

Jul 30, 2026 4:36PM


తెలుగు సినిమాకి, నటప్రపూర్ణ మోహన్ బాబు కి మధ్య ఉన్న అనుబంధానికి మధ్య ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. హీరోగా ఎన్నో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ లు అందించి   కలెక్షన్స్ కింగ్ అనిపించాడు. తెలుగు ప్రేక్షకులు ఎంత అదృష్టం చేసుకున్నారో అనే విధంగా, తనకి మాత్రమే సాద్యమయ్యే డైలాగ్ మాడ్యులేషన్ తో పస లేని సీన్ ని సైతం మెప్పించడం మోహన్ బాబు స్టైల్. సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా స్పీడ్ చూపించడం లేదు. అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే ఈ రోజు కృష్ణ గారి మనవడు జై కృష్ణ తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'తో సెల్యులాయిడ్ పై తిష్ట వేసాడు.    


అభిమానులతో పాటు మూవీ చూసిన వాళ్ళు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'మూవీలో మోహన్ బాబు పోషించిన 'వెంకటాద్రి నాయుడు' రోల్ ఆయన నటనా జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆ క్యారక్టర్ ద్వారా గంభీరం, బాధ్యత, కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే గుణం ఇవన్నీ కలగలిపి చేసి మెప్పించడం సాధారణ విషయమేమీ కాదు. ఒక రకంగా  మోహన్ బాబు వెంకటాద్రి నాయుడు క్యారక్టర్ కి ప్రాణప్రతిష్ట చేశారు.  డైలాగ్ డెలివరీ లో ఇంకా తగ్గని వేడి, హావభావాలు కట్టిపడేసాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలోని విలువలను, బంధాల ప్రాధాన్యతని  ఆవేశం, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే తీరు, న్యాయం వైపు నిలబడే గుణం ఒక రకమైన భావోద్వేగాన్ని నింపుతాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ మరో స్థాయికి తీసుకెళ్లింది. చిత్రం మొదటి భాగం నుంచి ముగింపు వరకు మోహన్ బాబు తనదైన స్టైల్‌లో సినిమాని ముందుకు నడిపించారు. ఆయన చూపించిన విలక్షణమైన అభినయం వల్ల  శ్రీనివాస మంగాపురంకి అంతటి పేరు, గుర్తింపు వస్తుంది. కాబట్టి దర్శకులు, రైటర్స్ మోహన్ బాబుకి వేంకటాద్రి నాయుడు లాంటి రోల్స్ రాయాలి. మోహన్ బాబు గారు ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని చేస్తూ  ఉంటే తెలుగు సినిమా తన వైభవాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం.

Also read: Srinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి!

Mohan Babu, Srinivasa Mangapuram, Jai krishna, Rasha Thadani

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com