
టాలీవుడ్లో ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాళిని రవి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక ప్రసంగకర్త మహావిష్ణును ఆమె వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మలేషియాలోని లంకావి దీవిలో వీరి పెళ్లి వేడుక జరిగింది. తాజాగా మృణాళిని స్వయంగా పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
మృణాళిని, మహావిష్ణు ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నారని సమాచారం. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 15న మలేషియాలోని లంకావి దీవిలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ మృణాళిని పెట్టిన క్యాప్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “జీవితం నా ప్రార్థనలకు ఇచ్చిన సమాధానాల్లో నువ్వే అత్యంత అందమైనది. 15.11.2026.. మనం 'ఒకటి'గా మారిన రోజు” అనే అర్థం వచ్చేలా ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మృణాళిని పెళ్లి ఫొటోల్లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పింక్ కలర్ పట్టుచీర, సంప్రదాయ బంగారు ఆభరణాలు, మల్లెపూలతో పెళ్లికూతురుగా అందంగా ముస్తాబయ్యారు. మరోవైపు మహావిష్ణు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సముద్రం పక్కన అందంగా అలంకరించిన వేదికపై జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. చిరంజీవి సహా తరలివచ్చిన ప్రముఖులు.!
సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని రవి.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి, సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో అథర్వ సరసన ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ‘చాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ వంటి తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ చిత్రాలతోనూ ప్రేక్షకులను పలకరించారు. 2024లో విజయ్ ఆంటోనీ సరసన ‘రోమియో’ సినిమాలో కనిపించారు.
ఇక పెళ్లి తర్వాత మృణాళిని సినిమాలకు దూరమవుతారా? లేక నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఆమె తన నటనా కెరీర్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మాత్రం పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మీకు నచ్చవచ్చు:
బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.!
ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్.. సందీప్ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?
[Mirnalini Ravi Wedding, Mirnalini Ravi Marriage, Mahavishnu, Tollywood Actress Wedding, Malaysia]





