Home

»

Latest News

బన్నీ-బోయపాటి కాంబో: ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.!

Nov 16, 2026 2:25PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఆసక్తికరమైన చర్చ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌కు ఓ స్టోరీ కాన్సెప్ట్‌ను వినిపించారట. అందులోని పాయింట్ నచ్చడంతో అల్లు అర్జున్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదట. పౌరాణిక అంశాలను మాస్ యాక్షన్‌తో మిళితం చేస్తూ బోయపాటి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే అల్లు అర్జున్ కెరీర్‌లో పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కే తొలి సినిమా కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా పట్టాలెక్కే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొందరేమో లోకేష్ కనగరాజ్, బోయపాటి శ్రీను సినిమాలు పారలల్ గా షూట్ జరుగుతాయి అంటున్నారు.

ఇది కూడా చదవండి: మరో సర్‌ప్రైజ్.. బోయపాటితో అల్లు అర్జున్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌.!

అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోంది? కథ ఏ పౌరాణిక అంశం చుట్టూ తిరుగుతుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తానికి ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు పౌరాణిక కథతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు:
క్రిష్‌ జగర్లమూడి దర్శకత్వంలో అల్లు అర్జున్‌.!
ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెక్స్ట్ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!

 

 

 

[Sarrainodu Combo, Allu Arjun, Boyapati Sreenu, Mythological Film, Geetha Arts]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com